బండి సంజయ్ కుమారుడిపై కేసు.. స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్
- బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
- ఈ విషయం బండి సంజయ్ కుటుంబంలో జరిగిందని వ్యాఖ్య
- బండి సంజయ్ కుటుంబ ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్న బీజేపీ చీఫ్
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన తెలిపారు.
ఈ విషయం బండి సంజయ్ కుటుంబంలో జరిగిందని ఆయన తెలిపారు. బీజేపీ అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలని అన్నారు.
మోదీ పర్యటనకు అసాధారణ స్పందన
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగసభకు అసాధారణ స్పందన వచ్చిందని రామచందర్ రావు అన్నారు. మోదీ పర్యటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో స్పష్టమైన ప్రకంపనలు వచ్చాయని అన్నారు. ఈ సభ విజయవంతం కావడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని అన్నారు.
వైద్యులు, నర్సులు, న్యాయవాదులు, యువత, మహిళలు, వివిధ రంగాల నిపుణులు, హైదరాబాద్ నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలతో కలిసి ఈ సభలో అపారమైన ఉత్సాహంతో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అశేష జనసమూహం, అక్కడ వెల్లివిరిసిన ఉత్సాహం, మోదీ నాయకత్వంపై, అలాగే 'వికసిత తెలంగాణ - వికసిత భారతదేశం' అనే దార్శనికతపై ప్రజలలో పెరుగుతున్న అచంచలమైన విశ్వాసానికి సజీవ నిదర్శనంగా నిలిచిందని రామచందర్ రావు అన్నారు.